నవతెలంగాణ – హైదరాబాద్: హన్మకొండలోని హనుమాన్ నగర్ కు చెందని 15 ఏండ్ల బాలుడు నిరంజన్ తీవ్ర నరాల సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా బాలుడు రెండు, మూడేండ్ల వయస్సున్ను పిల్లాడిలాగే కనిపిస్తాడు. దీనికి తోడు అతని కాళ్లు కూడా పనిచేయవు. జీవితంతో పోరాడుతున్న ఆ బాలుడికి తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను కలిసి, ఆయన సినిమా డైలాగ్‌ను ఆయన ముందే చెప్పాలనేది ఒకే ఒక్క చివరి కోరిక. విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం నేరుగా బాలుడి ఇంటికి వెళ్ళి, నిరంజన్ ను ఆప్యాయంగా పలకరించాడు. అదేవిధంగా వారి తలిదండ్రులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన నేరుగా విజయవాడకు బయలుదేరారు.



