కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం..
నవతెలంగాణ – మల్హర్ రావు
కొత్త విద్యా సంవత్సరం ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది.దీంతో గ్రామాల నుంచి పట్టణాలకు,మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి ప్రతిరోజూ విద్యాసంస్థలకు వెళ్లే వేలమంది విద్యార్థుల దృష్టి ఇప్పుడు బస్ పాసులపై పడింది.తక్కువ ఖర్చుతో సురక్షితంగా ప్రయాణించేందుకు బస్ పాసులు కీలకంగా మారాయి.
ఉచిత, రాయితీ బస్ పాసులు..
20 కిలోమీటర్లలోపు దూరంలో ఉన్న 12 సంవత్స రాలలోపు బాలురకు ఉచిత బస్ పాస్ ఇవ్వనున్నారు. హైస్కూల్ బాలురు 35 శాతం రాయితీతో బస్ పాస్ పొందవచ్చు.ప్రభుత్వ పాఠశాలలకు ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ ఫీజు ఉండదు.ప్రైవేట్ పాఠ శాలలు,కళాశాలల వారు మాత్రం టీఎస్ ఆర్టీసీకి అడ్మినిస్ట్రేషన్ ఫీజు డీడీ రూపంలో చెల్లించాలి.అకౌంట్ ఆఫీసర్,టీజీఎస్ ఆర్టీసీ పేరుపై డీడీ తీయాలి.
ప్రయివేట్ సంస్థలు చెల్లించాల్సిన ఫీజులు..
పాఠశాలలు (మొత్తం విద్యార్థులు 500 మంది పైగా) కొత్త పాస్కు రూ.2 వేలు, రెన్యూవల్కు రూ.వెయ్యి జూనియర్ కళాశాలలు,వొకేషనల్, ఐటీఐ, డిప్లొమా: కొత్త పాస్కు రూ.5 వేలు, రెన్యువల్కు రూ.4,000,డిగ్రీ కళాశాలలు: కొత్త పాస్కు రూ.6 వేలు, రెన్యువల్కు రూ.5 వేలు,ఇంజనీరింగ్, మెడిసిన్ కళాశాలలు కొత్తగా రూ .7 వేలు, రెన్యువల్కు రూ.6 వేలు చెల్లంచాలి.
దరఖాస్తు విధానం..
డీడీలు చెల్లించిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ లో యూజర్ ఐడీ,పాస్ వార్డు తీసుకోవాలి.ఆ తర్వాత విద్యార్థుల బస్ పాస్లు ఆన్లైన్లో దర ఖాస్తు చేసుకోవచ్చు.బస్ పాస్ కౌంటర్ సేవలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.



