పిడిఎస్ బియ్యం పట్టివేత 

నవతెలంగాణ కంఠేశ్వర్ 
మూడు టన్నుల పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి బుధవారం తెలిపారు. సిసిఎస్ ఏసిపి నాగేంద్ర చారి తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సిసిఎస్ నాగేంద్ర చారి, తమ సిబ్బంది కలిసి కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల గాంధీ నగర్ లో పిడిఎస్ తో ఉన్న మహేంద్ర గూడ్స్ కారియార్ వాహనంపై రైడ్ చేశారు. సుమారు మూడు టన్నుల వీడియోస్ రైస్ పట్టుకోవడం జరిగిందని తెలిపారు దీని విలువ లక్ష వరకు ఉంటుందన్నారు. అనంతరం కమ్మర్పల్లి ఎస్హెచ్ఓకు అప్పగించామన్నారు.
Spread the love