కమ్మర్ పల్లిలో శాంతి కమిటీ సమావేశం

Peace Committee meeting at Kammer Pallyనవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఇన్చార్జి ఎస్ఐ విక్రమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పండుగల నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలు, తదితరాంశాలపై శాంతి కమిటీ సభ్యులతో ఆయన  చర్చించారు. ఈ సందర్భంగా ఎస్ఐ విక్రమ్ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు, మిలాద్ ఉన్ నబీ వేడుకలను ప్రజలు ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు.గణేష్ ఉత్సవ కమిటీలు తప్పనిసరిగా గణేష్ మండపాల ఏర్పాటుకు  అనుమతి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కమ్మర్పల్లి ఏఎస్సై షేక్ ఇస్మాయిల్, హెడ్ కానిస్టేుల్ రాజశేఖర్, సిబ్బంది, తదితరులు  పాల్గొన్నారు.

Spread the love