ఆక్రమణకు గురౌతున్న పెద్దవాగు శిఖం నేలలు…

– నిరోధించాలని తహశీల్దార్ కు వినతి…
నవతెలంగాణ – అశ్వారావుపేట
వర్షాకాలం వరదలకు శిధిలం అయిన పెద్దవాగు ప్రాజెక్ట్ శిఖం నేలలు ఆక్రమణలకు గురి అవుతున్నాయని,తెలంగాణేతర రైతులు ఆక్రమించుకుంటూ ఉన్నారని పెద్దవాగు ఆయకట్టు రైతులు పలువురు పుట్టా సత్యం నేతృత్వంలో శుక్రవారం తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ కు వినతి పత్రం అందించారు.ఈ విషయం అయి చర్యలు నీటి పారుదల శాఖ అధికారులతో చర్చించి చర్యలు చేపడతామని ఆయన రైతులకు తెలిపారు. ఈ విషయం అయి ఐబీ ఈఈ శ్రీనివాస్ ను వివరణ కోరగా ఆక్రమణలు విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే తహశీల్దారు కు తెలియజేసాం అని,ఆక్రమణలు నిరోధించాల్సిన బాధ్యత రెవిన్యూ శాఖ దే నని అన్నారు.
Spread the love