
నవతెలంగాణ – భువనగిరి
అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె కాలపు వేతనం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలనీ సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం నూతన ప్రభుత్వాన్ని కొరారు. శుక్రవారం సిఐటియు మండల సమన్వయ కమిటి సమావేశం మండల కన్వీనర్ గొరిగే సొములు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ గత ప్రభుత్వం కార్మికుల సంక్షేమం విస్మరించిందని అందుకే కార్మికులు తగిన గుణపాఠం చెప్పారన్నారు . అంగన్వాడీ ఉద్యోగులు న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేశారని అసందర్భంగా కాంగ్రెస్ నాయకులు సంఘిబావంగా సమ్మె శిబిరాలు సందర్శించి మాద్దత్తు ప్రకటించరన్నారు. అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కారం చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.కార్మికుల సంక్షేమం గురించి నూతన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ గోరిగే సోములు, గ్రామ పంచాయితీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బందేల బిక్షం, అంగన్వాడీ యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు లలిత,మంజుల భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అద్యక్షులు వంగాల మారయ్య, గ్రామ పంచాయితీ యూనియన్ మండల కార్యదర్శి నకిరెకంటి రాము, హమాలీ సంఘం మండల అధ్యక్షులు దండిగ అంజయ్య హమాలీ నాయకులు కంబాలపల్లి రాములు , అంగన్వాడీ నాయకులు సువర్ణ,కంకల నరసింహ పాల్గొన్నారు.