బుచ్చిరెడ్డికి  పెందోట బాల సాహిత్య పురస్కారం..

నవతెలంగాణ – చండూర్  
స్థానిక చండూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయులు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి పెందోట బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైనట్లు శ్రీవాణి సాహిత్య పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు పెందోట వెంకటేశ్వర్లు తెలిపారు. 2024 సంవత్సరానికి గాను  బుచ్చిరెడ్డి బాలల కోసం రాసిన “బంతిపూలు ” కథల సంపుటి నల్లగొండ జిల్లా నుండి ఎంపిక చేయడం జరిగిందని తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుండి వివిధ విభాగాల కింద 13 మంది కవులు, రచయితలు ఎంపికైనట్లు వీరందరికీ త్వరలో సిద్దిపేటలో జరిగే  సంస్థ పదో వార్షికోత్సవంలో నగదు, శాలువా, మెమొంటోలతో పురస్కారాన్ని అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుచ్చిరెడ్డి పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎడ్ల బిక్షం, ఉపాధ్యాయులు, కవులు రచయితలు వివిధ సంఘాల ప్రతినిధులు అభినందించారు.
Spread the love