సోషల్ జస్టీస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో బట్టాపూర్ వాసులు

నవతెలంగాణ – ఏర్గట్ల
సోషల్ జస్టీస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లో నూతన కమిటీలను నేషనల్ ఛైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్,నేషనల్ జనరల్ సెక్రెటరీ మామిడాల మనోహర్ లు కలిసి ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి చెందిన కట్కం  సామంత్ రెడ్డిని డిస్ట్రిక్ డైరెక్టర్ గా,కైరి నరేష్ గౌడ్ ను ఆర్మూర్ కాన్స్టెన్సీ ఛైర్మెన్ గా నియమించారు.ఎన్నికైన సభ్యులకు రాష్ట్ర చైర్మన్ నోముల సంపత్ గౌడ్,డిస్ట్రిక్ చైర్మన్లు దత్తు గౌడ్,చంద్రకాంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు సామంత్ రెడ్డి,నరేష్ గౌడ్ మాట్లాడుతూ… రాజ్యాంగంలో ఉన్న మానవ హక్కులను హరించడం గాని,అసాంఘిక కార్యకలాపాలు జరిగినా తమ దృష్టికి తేవాలని కోరారు.
Spread the love