భారీ వర్షాలతో ప్రజల అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాలతో ప్రజల అప్రమత్తంగా ఉండాలి– ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.
నవతెలంగాణ- రాయపోల్
గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చెరువులు, చెక్ డ్యామ్ లు మత్తళ్లు దుంకుతున్నాయి.ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి. రోడ్ల ఫై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలి.పాత  గోడలు, ఇల్లు కూలిన దగ్గర ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.రోడ్ల ఫై చెట్లు, రోడ్డు తెగిపోతే అధికారుల ద్రుష్టి  తీసుకెళ్లాలి.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సాధ్యమైనంతవరకు బయటకు వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కారం. చెరువులు, వాగులు ఉప్పొంగుతున్నాయని వరద ప్రవాహాన్ని చూసేందుకు ప్రయత్నించరాదు. వర్షం పడుతున్నప్పుడు చెట్ల కింద ఉండరాదు. వర్షంలో తడవడం చిన్నపిల్లలు వర్షంలో ఆడకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు, నియంత్రికలు, వైర్లు,మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి. తడిసిన విద్యుత్ స్తంభాల సపోర్ట్ వైర్, విద్యుత్ ఉపకరణాలను తాకరాదు. బట్టలు ఆరేసుకునే తీగకు విద్యుత్ తీగకు వైర్లు కలపరాదు. తెగిపడిన, వేలాడుతున్న విద్యుత్ తీగలను తాకరాదు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద శబ్దం వచ్చిన విద్యుత్ మరమ్మతులు ఉన్న సంబంధిత శాఖ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. చెరువులు, కుంటలు, వాగులు వద్దకు వెళ్లి సెల్ఫీలు దిగడానికి అత్యుత్సాహం చూపి ప్రమాదాల బారినపడవద్దన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడే కంటే అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు
Spread the love