ఉచిత సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

– అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ 
– రేషన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీ
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్న బియ్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు.గురువారం మండల కేంద్రమైన తాడిచర్లలో జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్ తో కలిసి ఆయన పలు రేషన్ దుకాణాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని అన్ని చౌక దుకాణాల్లో బియ్యం స్టాక్ చేరిందని లబ్ధిదారులు సన్నబియ్యం తిసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 77శాతం పంపిణీ జరిగినట్లు తెలిపారు. సన్నబియ్యం పంపిణీ పై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ సన్నబియ్యం అందాలని తెలిపారు. బయోమెట్రిక్ ద్వారా బియ్యం సరఫరా వివరాల నమోదు పరికరాన్ని పరిశీలించారు. ఎటువంటి ఆలస్యం చేయకుండా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు. అనంతరం రేషన్ కార్డు దరఖాస్తులు విచారణ పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట తహసీల్దార్ కె రవి కుమార్, ఆర్ఐ తదితరులు ఉన్నారు.
Spread the love