నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
పట్టణంలోని స్థానిక 18వ వార్డులో నెలకొన్న పలు సమస్యలపై బుధవారం పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని హైదరాబాదులో వారి నివాసం లో వార్డు సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా నాగరత్నం రాజు మాట్లాడుతూ 18 వ వార్డు, అలివేలుమంగాపురం కాలనీలో ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు మొదలగు సమస్యలను మంత్రి కోమటి వెంక రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లను పూర్తిచేసి వార్డును పూర్తిదశలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలివేలుమంగాపురం కాలనీ ప్రెసిడెంట్ దండా వెంకటరామిరెడ్డి, జనరల్ సెక్రెటరీ చనగోని ముత్తయ్య గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గుండపనేని కిషన్ రావు, రేణుక ఎల్లమ్మ గుడి మాజీ చైర్మన్ ప్రెసిడెంట్ వుగ్గె పులేందర్, నాగిళ్ల నరసయ్య తదితరులు పాల్గొన్నారు.