ప్రభుత్వం కల్పించిన జి.వో 59 తో స్థలాలను క్రమబద్దీకరించుకోవాలి

– కూకట్‌పల్లి తహసీల్దార్‌ గోవర్ధన్‌
నవతెలంగాణ – కూకట్‌ పల్లి
కూకట్‌పల్లి మండల పరిధిలోని నివాసితులు.. ప్రభుత్వం కల్పించిన 58 జీవోతో వారిస్థలాలను క్రమబద్దీకరించు కోవాలని కూకట్‌ పల్లి తహసీల్దార్‌ గోవర్ధన్‌ తెలిపారు. జీవో 58, 59 తో ప్రజల్లో నెలకొన్న సందేహాలను, దరఖాస్తు చేసుకున్న నివాసితులకు ప్రభుత్వం పంపించిన నోటీస్‌లో వచ్చిన అధిక రుసుము చెల్లించేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులపై, శుక్రవారం కూకట్‌ పల్లి డివిజన్‌ పాపిరెడ్డినగర్‌ లోని శ్రీశ్రీశ్రీ వీరంజనేయ శివాలయం కమిటీ హాల్లో, బస్తీి అధ్యక్షుడు ఊట్ల చంద్రారెడ్డి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన గోవర్ధన్‌ వాటిని నివృత్తి చేశారు. రెండు లక్షలు ఆపై ఉన్న డబ్బులను చెల్లించి రెగ్యులరైజ్‌ చేయించుకోవలన్నారు. రూ. 10, 20 లక్షలు ఆపై చెల్లించాలని నోటీసులు అందుకున్న వారి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగ్గించే వెసులుబాటును కల్పించేందుకు ప్రయత్నం చేస్తానని గోవర్ధన్‌ ఈ సందర్భంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ ఐ శ్రీనివాస్‌ రెడ్డి, బస్తి ప్రధాన కార్యదర్శి భగవంతరెడ్డి , కోశాధికారి నర్సింహులు ముదిరాజ్‌ నాయకులు, పేర్ని ధర్మారావు ,దొడ్ల రాంరెడ్డి ,జీబీ కన్నారవు, వెంకటరెడ్డి, ఎం కనక రెడ్డి, శ్రీకాంత్‌ రెడ్డి, శ్రీనివాసరావు, బిక్షపతి ,తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love