
ఖరీఫ్ లో పండించే పంటలకు తప్పక సస్యరక్షణ చర్యలు చేపట్టాలని జుక్కల్ మండల వ్యవసాయాధికారి నవీన్ కూమార్ పేర్కోన్నారు. బుధువారం నాడు మండలంలోని లొంగన్ గ్రామములో రైతుల పంటల పోలాలలోకి క్షేత్రస్థాయిలోకి వెళ్లి పెసర, పత్తి, మినుము, సోయా, కంది ఇతర పంటలను పరీశీలించారు. ఈ సంధర్భంగా రైతులతో మాట్లాడుతు చీడ పురుగుల నివారణ, సస్యరక్షణ యాజమాన్యం, రసాయన ఎరువులు, స్ప్రే మందలు అధికంగా మేాతాదుకు మించి వాడకంలో వచ్చే నష్టాలు రైతులకు అవగాహన చేయడం జర్గింది. రసాయన మందులను వాడేముందు వ్వవసాయ సంభందిత ఏఈవో లతో సంప్రదించి వారి సూతనల మేరకు రసాయన ఎరువులు, స్ప్రే మందులు వాడాలని, తమకిష్టం వచ్చి నట్టు వాడద్దని సూచించారు. ఏవోతో పాటు లొంగన్ గ్రామ ఆదర్శ రైతు సదుపటేల్, తదితరులు పాల్గోన్నారు.