ఇంట్లో పెంచుకునే మొక్కల్లో కొన్ని అద్భుతమైనవి ఉన్నాయి. మన మెదడును చురుగ్గా ఉంచే శక్తి మొక్కలకు ఉంది. మనల్ని రకరకాల వ్యాధుల నుంచి కాపాడతాయి. అవి మనకు మంచి ఆక్సిజన్ ఇవ్వడమే కాదు శరీరం లోపల విష వ్యర్థాల్ని తరిమేసి ఆరోగ్యాన్ని పెంచుతాయి. తులసి మొక్క ఎంత మంచిదో మనకు తెలుసు. దాని నిండా ఔషధ గుణాలే. అలాంటివే మరికొన్ని ఉన్నాయి. అవి మనం తినే ఆహారానికి సువాసన, రుచి అందిస్తాయి. వాటిని నిత్యం వాడుతూ ఉంటే… అనేక సమస్యలు దూరమవుతాయి. అలాంటి ఐదు మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్టివియా… : పంచదారను ఎక్కువగా వాడితే బరువు పెరుగుతాం. దీనివల్ల షుగర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ స్టివియా మొక్కను పంచదార బదులు వాడొచ్చు. ఇది ఇళ్లలోనే పెరుగుతుంది. టీ పెట్టుకునే టప్పుడు కొన్ని ఆకుల్ని తీసుకొని టీలో వేస్తే చాలు. టీపొడితో పాటూ ఇవీ మరిగి తీపిని అందిస్తాయి. పైగా ఈ ఆకులు కీళ్ల నొప్పులు, గుండెజబ్బుల నుంచి కాపాడతాయి. ముసలితనాన్ని అడ్డుకుంటాయి. దంతాల్ని కాపాడతాయి. నోట్లో బ్యాక్టీరియా ఉంటే అస్సలు ఊరుకోవు.
క్రెస్ : ఈ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది. రెండు వారాల్లోనే బోలెడు మొక్కలు, ఆకులు వస్తాయి. వీటిని కూరల్లో వాడితే మన కంటి చూపు మెరుగవుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాన్సర్‌ని ఈ మొక్కలు అడ్డుకుంటాయి. దంతాలు, చిగుళ్లను కాపాడతాయి. ఈ మొక్కల ఆకుల్ని జ్యూసులు, సలాడ్లు, పాస్తాలు… ఇలా తినేవాటిలో వేసుకుంటే సరి.. ఆరోగ్యం సంగతి అదే చూసుకుంటుందట.
బ్లడీ సోరెల్ : ఈ ఆకులపై ఆకారాలు మన బాడీలోని ధమనులు, సిరల్లా కనిపి స్తాయి. అందుకే… ఈ మొక్కకు బ్లడీ సోరెల్ అనే పేరు పెట్టారు. ఈ మొక్కలు మధ్య ఆసియా దేశాలు, గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఆకులు బీపీని నియంత్రిస్తాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి. బాడీలో విష వ్యర్థాల్ని తరిమి కొడతాయి. వీటిలో విటమిన్ ఏ, సీ, మెగ్నీషియం ఉంటాయి. ఈ ఆకుల్ని శాండ్‌విచ్, సూప్స్, జ్యూసుల్లో, కూరల్లో వాడేస్తే సరి.
హిసోప్ ప్లాట్ : ఔషధ మొక్కల్లో దీన్ని క్వీన్ అని చెప్పుకోవచ్చు. పూర్వకాలం నుంచి దీన్ని మందుల్లో వాడుతున్నారు. ఈ మొక్క మన చుట్టుపక్కల వాతా వరణాన్ని క్లీన్ చేస్తుందని చెబుతారు. ఈ మొక్క ఆకులు మన జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి. శ్వాస బాగా ఆడేలా చేస్తాయి. ఈ ఆకులు యాంటీసెప్టిక్, యాంటీబయోటిక్‌గా పనిచేస్తాయి. కండరాల నొప్పిని పోగొడతాయి. ఇలా ఈ మొక్క ఆకుల వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య లాభాలున్నాయి. మీరు తినే ఆహారంలో ఈ మొక్క ఆకుల్ని అప్పుడప్పుడూ వేసేసుకోవడమే.
సేజ్ హెర్బ్ : ఇది కూడా ఔషధ మొక్కే. చాలా ఆహారాల్లో దీని ఆకుల్ని ఉపయోగిస్తారు. ఈ ఆకుల చిన్న ముద్ద నోట్లో వేసుకొని తింటే చాలు జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చురుకుదనం వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. కడుపులో నొప్పి పోతుంది. దీని గింజలు, పప్పులతో పాటుగా వండుకుంటారు. వంటల్లో ఈ ఆకుల్ని కూడా వేసుకుంటే సరి. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.