విద్యుత్ కార్మికుల ప్లాటినం జూబ్లీ వేడుకలు

నవతెలంగాణ – చండూరు 
స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో 1104 యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు జరిగినాయి. జిల్లా నాయకత్వం పిలుపుమేరకు చండూరు విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో చండూరు 1104 యూనియన్ మండల అధ్యక్షుడు  యం.డి.షజ్జు పాష 1104 యూనియన్ జెండా ను ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా  నల్లగొండ డివిజన్ కోశాధికారి యం.డి.షరీఫ్ పాష కార్మికుల ను ఉద్దేశించి మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడే ఏకైక యూనియన్ 1104  యూనియన్ అని అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి విద్యుత్ సంస్థ లో కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయించి కార్మిక సంక్షేమం కొరకు నిరంతరం పాటుపడి ఎందరో కార్మికుల జీవితాలలో వెలుగు నింపిన యూనియన్ అని  అలాంటి ఘన చరిత్ర కలిగినటువంటి యూనియన్ 74 వ వసంతం పూర్తి చేసుకొని 75 వ వసంతం లోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఈ ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లేషం,ముత్యంరెడ్డి,చంద్రమౌళి, వెంకన్న,గోవర్దన్, సురేష్ రెడ్డి, సైదులు, హరిలాల్, పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love