చెరువు వరద నీటితో రైతుల అవస్థలు

నవతెలంగాణ – రాయపర్తి

రామచంద్రుని చెరువు వరద నీటితో అవస్థలు పడుతున్నామని బాధిత రైతులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత రైతుల మాటల్లోనే తెలుపుతూ… రాయపర్తి మండల కేంద్రంలో అతి పెద్ద చెరువు రామచంద్రుని చెరువు అని తెలిపారు. సుమారు 600 ఎకరాలకు సాగునీరును అందిస్తుందన్నారు. అలాంటి చెరువును లీజుకు తీసుకున్న చేపల వ్యాపారి చెరువులోని నీరును తగ్గించాలనే దురాలోచనతో చెరువు మత్తడి కింద జెసిబి సహాయంతో గండి కొట్టించినట్లు తెలిపారు. దాంతో నీరు ప్రవాహముల పంట పోలాలను ముంచి వేసిందన్నారు. స్థానికంగా ఉండే రైతులు ఇదేంటని ప్రశ్నించేగా కొంత కాలం తర్వాత గండి పూడ్చినట్లు తెలిపారు. నాటినుండి నేటి వరకు కూడా చెరువులోని నీరు దారాళంగా ప్రవహిస్తుందన్నారు. తూము ద్వారం సైతం రిపేరుకు వచ్చిన పట్టించుకున్న నాథుడు లేదన్నారు. దాంతో నీరు వ్యవసాయ భూముల గుండా నిత్యం ప్రవహించడంతో ఆయా భూముల్లో పంట పండించుకోలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 80 ఎకరాల్లో చెరువు నీరు వలన జమ్మూ విపరీతంగా పెరిగి పంట భూములు నాశనం అవుతున్నాయన్నారు. అధికారులు స్పందించి చెరువు నీరు వృధా కాకుండా చూడాలని పెద్దవాగు డ్యామును పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెవ్వు సతీష్, నాగుల సాయిమల్లు, కసరబోయిన సంపత్, ఉడుత రాజు, పెద్దగోని మల్లేష్, పెండ్యాల గణేష్, వీరు, వెంకటేష్, మచ్చ యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love