Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహమ్మదాపూర్ లో పోచమ్మ బోనాలు 

మహమ్మదాపూర్ లో పోచమ్మ బోనాలు 

- Advertisement -

– హాజరైన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ 
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ మండలంలోని మహమ్మదాపూర్ గ్రామంలో ఆదివారం పోచమ్మ బోనాలు, సార్గమ్మ పునఃప్రతిష్ఠా ఘనంగా నిర్వహించారు. బోనాల పండుగ, సార్గమ్మ పునఃప్రతిష్ఠా వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. గ్రామంలో ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, సమృద్ధిగా జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. పోచమ్మ బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -