మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల తనిఖీలు

మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో పోలీసుల తనిఖీలునవతెలంగాణ -వేమనపల్లి
మావోయిస్టు వారిత్సవాల నేపథ్యంలో నీల్వాయి ఎస్సై శ్యామ్‌ పటేల్‌ తన సిబ్బందితో పాటు టిఎస్‌ఎస్పీ సిబ్బందితో కలిసి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మంగనపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద సోమవారం వాహనాల తనిఖీ చేపట్టారు. వ్యక్తుల వివరాలు తెలుసుకుంటూ వారి వెంట ఉన్న వస్తువులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ నీల్వాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆకస్మిక తనిఖీలు, ఆర్‌ఓపి, ఏరియా డామినేషన్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. తమ నివాస ప్రాంతాల్లో ఎవరైన కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించినట్లయితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

Spread the love