అక్రమ ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు…

నవతెలంగాణ – భీంగల్ రూరల్
ఈ రోజు పోలీస్ లు ఉదయం అందాజా 5 గం సమయ ప్రాంతంలో భీంగల్ మండలం లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కుప్కల్ గ్రామ శివారులో ఇసుక లోడ్ తో వస్తూన రెండు ట్రాక్టర్లను ఆపి, అట్టి భీంగల్ కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు సిర్సు రాములు, వేముల ప్రశాంత్ భీంగల్ అట్టి ఇసుకకు సంబంధించిన పత్రాలు అడుగగా ఎలాంటి పత్రాలు చుపించానందున. అక్రమంగా తరలిస్తున ఇసుక  ట్రాక్టర్ లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించి డ్రైవర్లు  సిర్సు రాములు,వేముల ప్రశాంత్ లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించానైనదని ఎస్ ఐ జి, మహేష్ తెలిపారు.భీంగల్ మండలం లో అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
Spread the love