గుట్కల తయారీ స్థావరంపై పోలీసుల దాడి

గుట్కల తయారీ స్థావరంపై పోలీసుల దాడి– పట్టుబడ్డ సామాగ్రి
– ఎస్‌ఐ స్రవంతి
నవతెలంగాణ-కోట్‌పల్లి
కోట్‌పల్లి మండల పరిధిలోని ఒగ్లపురం శివారులో గుట్కల తయారీ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న విషయాన్ని విశ్వనీయ సమాచారంతో కోట్‌పల్లి పోలిసులు తనిఖీ చేయగా తెలంగాణ ప్రభుత్వం నిషేధించిన గోవా గుట్కాలు ఎటువంటి అనుమతి లేకుండా తయారు చేస్తున్న సుమారు 20 బస్తాలు 30 కేజీవి, గుట్కా ముడి పదార్థం 2 కిలోలు, గుట్కాలో కలిపే కెమికల్‌, పూర్తిగా తయారు చేసిన 2000 గుట్క ప్యాకేట్‌. కవర్లు పట్టుబడగా అబ్దుల్‌ కరీం అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు కోట్‌ పల్లి ఎస్సై స్రవంతి తెలిపారు.

Spread the love