ఆర్బీఐ నూతన డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్‌ గుప్తా

Poonam Gupta is the new Deputy Governor of RBIన్యూఢిల్లీ : ఎన్‌సీఏఈఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ అయిన పూనమ్‌ గుప్తాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నూతన డిప్యూటీ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. మూడేండ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగనున్నారు. తాజా నియామకాన్ని నియామకాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదించిందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. డిప్యూటీ గవర్నర్‌గా ఎండీ పాత్రా జనవరిలో పదవీ విరమణ చేసినప్పటి నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. ఈ నెలాఖరులో ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షకు ముందు పూనమ్‌ నియమాకం జరగడం విశేషం.

Spread the love