నవతెలంగాణ – తాడ్వాయి
తాడ్వాయి మండలం లింగాల గ్రామంలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బిపిఎం) ఊకే నాగేశ్వరరావు తల్లి ఊకే సమ్మక్క ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. శుక్రవారం నాడు దశదినకర్మకు పస్రా సబ్ పోస్ట్ ఆఫీస్ ఎస్ పి ఎం బొమ్మ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ సిబ్బంది బృందం హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి, ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కీర్తిశేషులు ఊకే సమ్మక్క చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బిపిఎం నాగేశ్వర్రావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఊకే సమ్మక్క చాలా మంచి మనిషి అని, అందరి మనలను పొందారని, ఆమె మన మధ్యన లేకపోవడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో పస్రా సబ్ పోస్ట్ ఆఫీస్ ఎస్ పి ఎం బొమ్మ శ్రీనివాస్, ఏ బి పి యం లు తమ్మల సాహితీ అశోక్, ఊకే రవి బుచ్చయ్య, పాషా, ఇరుప వెంకటేశ్వర్లు, సందీప్ రాజ్ కుమార్, సాంబయ్య, నరేష్, తరుణ్ సబ్ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది, ఏబిపిఎంలు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.