ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించారు..

– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతుకే జండగే…
నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
ప్రజావాణిలో  ప్రజలు అందించిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిచ్చి వేగంగా పరిష్కారం చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో  సోమవారం నాడు జరిగిన  ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి 96 ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో రెవిన్యూ శాఖ 73, ఉపాధి కల్పన 3, ఏద్యాశాఖ 4, పంచాయితీ శాఖ 2, పౌర సరఫరాలు 2, గురుకుల పాఠశాల 2, అటవీ శాఖ 1, గ్రామీణాభివృద్ది శాఖ 1, ల్యాండ్ రికార్డు 1, ఎంపిడిఓ 1, వైద్య శాఖ 1, మత్స్యశాఖ 1, విద్యుత్ శాఖ 1, మున్సిపాలిటీ 1, ఎస్.సి. సంక్షేమం 1, మహిళా శిశు సంక్షేమం 1 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టరు పి.బెన్షా లోమ్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, జిల్లా పరిషత్ సిఇఓ శోభారాణి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్ ఎఓ జగన్మోహన్ ప్రసాద్, కలెక్టరేటు సూపరింటెండెంట్ పార్ధసారథి, జిల్లా అధికారులు ఉన్నారు.
Spread the love