కాకతీయు విద్యా సంస్థ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు

నవతెలంగాణ- జమ్మికుంట:
జమ్మికుంట పట్టణంలోని కాకతీయ విద్యాసంస్థల లో గురువారం రాత్రి ఆ పాఠశాల ఆవరణంలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఆ విద్యాసంస్థల చైర్మన్ ఆవిర్నేని సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతిలో దొరికే రంగురంగుల పూల మొక్కలను తీసుకొచ్చి బతుకమ్మను పేర్చి, ఆ బతుకమ్మ  చుట్టూ విద్యార్థినిలు, ఉపాధ్యాయులు తిరుగుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడి పాడారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యాసంస్థల చైర్మన్ ఆవిర్నేని సుధాకర్ రావు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు
Spread the love