అకాల వర్షం.. అపార నష్టం 

– అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బందులు 
– మండలంలో ఇంటి పైకప్పులు లేచిపోయిన ఇండ్లు మొత్తం- 25 
– నర్సాపూర్(పిఏ), ఇద్దరు రైతులు, అంకంపల్లి లో ఇద్దరు రైతులు తీవ్ర నష్టం 
– అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు 
నవతెలంగాణ -తాడ్వాయి 
అకాల వర్షాలకు ములుగు జిల్లా తాడ్వాయి ఏజెన్సీలో నష్టాన్ని, కన్నీటిని మిగిల్చాయి. జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులు కురిసిన ఈదురు గాలులతో కూడిన వానలకు ఇంటి పైకప్పులు గాల్లోకి ఎగిరి కింద పడిపోయాయి. ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతరత్రా సామాన్లు నాని ముద్దాయి అక్కరకు రాకుండా తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మండలంలోని నర్సాపూర్ (పిఏ), ఊరట్టం, వెంగళాపూర్, బంధాల, దామరవాయి గ్రామపంచాయతీలలో గతంలో నిర్మించిన స్మశాన వాటికల పై కప్పులు లేచి గాల్లో కలిసిపోయాయి. నార్లాపూర్ లో మొక్క వెంకటేశ్వర్లు, సంకె బిక్షపతి, రెడ్డి రాజు రజిత, తాపెల్లి లలిత, ఎల్బాక- పడిగాపూర్ లో చాప బుచ్చయ్య, మొక్క రాజు, నుల జంపయ్య, గండు అచ్చమ్మ, చాప నాగమణి, కారింగుల పెద్దిరాజు, మర్రి నరసింహారెడ్డి, పాల రాజు, జజ్జరి పెద్ద చంద్రయ్య, మొత్తం నార్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో 15 ఇండ్లు పైకప్పులు లేసి పూర్తిగా ధ్వంసం అయ్యాయి.  బయ్యక్కపేట గ్రామపంచాయతీ పరిధిలో  9 ఇండ్లు నష్టం వాటిల్లింది. (బయ్యక్కపేటలో) ఇద్దరు రైతులు పంట నష్టం వాటిల్లింది. ఒక మామిడి రైతు కూడా మామిడికాయలు పూర్తిగా కింద రాలిపోయి నష్టం వాటిల్లింది. ఊరట్టం లో గుండ్ల దేవేందర్ అనే రైతు ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇంటిలోని అన్ని సామాన్లు నిత్యవసర సరుకులు అన్ని నానిపోయి పాడయ్యాయి. రాత్రంతా ఇద్దరు చిన్న పిల్లలతో బిక్కు బిక్కి మంటూ గాలి వానలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చర్ప దిగంబర్ అనే ఆదివాసి రైతు వరి పొలం కూడా పూర్తిగా ధ్వంసం అయింది.
తాడ్వాయి మండల కేంద్రంలో ఎల్లబోయిన రాకేష్ మొన్న చికెన్ సెంటర్ పై కప్పు పూర్తిగా లేచిపోయింది.  మేడారం లోని రెడ్డిగూడెం లో జంగా వెంకటరామిరెడ్డి కి చెందిన మామిడి తోటలో  మామిడికాయలు పూర్తిగా తిరిగి కింద పడిపోయి నష్టపోయాయి. మేడారంలో సుమారు 5 ఇళ్లు పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి. వరి పొలాల్లో కూడా ధాన్యం రాలిపోయింది. వెంగలాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో తోలెం సంధ్యారాణి, అల్లెం లక్ష్మి, పర్షిక భద్రమ్మ, నాలి నరేష్, దానుసరి నాగేశ్వరరావు, ఆలం బాయమ్మ, సోయం నాగార్జున మొత్తం 7 ఇండ్లు కప్పులు లేచిపోయి డ్యామేజ్ అయ్యాయి. నర్సాపూర్ పిఏ జిపి లో నాలి రాంబాబు కు సంబంధించిన మూడు ఎకరాల మొక్కజొన్న, మరో రైతుకి మూడెకరాలు మొత్తం ఆరు ఎకరాల మొక్కజొన్న నేలమట్టమయింది. అంకంపల్లి లో మంకిడి లక్ష్మయ్య, మంకిడి భాస్కర్ అనే ఆదివాసి రైతులకు చెందిన మొక్కజొన్న, వరి చేనులు నేలమట్టమై పూర్తిగా ధ్వంసం అయ్యాయి. అంతే కాకుండా తాడ్వాయి – పస్రా జాతీయ రహదారి చెట్లుబడి 163 వ జాతీయ రహదారి రాకపోకలు గంట సేపు నిలిచిపోయాయి. అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తన పోలీస్ బలగాలతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రోడ్లపై పడిన చెట్లను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం 
గత రెండు రోజుల క్రితం కురిసిన వడగండ్ల వాన, గాలులు ఉరుములు మెరుపులతో ఏజెన్సీ మండలం అతలాకుతలం అయింది. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఆదేశాల మేరకు మండల అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్, తాడ్వాయి తాసిల్దార్ సురేష్ బాబు, ఎంపీడీవో సుమన వాణి, మండల పంచాయతీరాజ్ అధికారి (ఎంపిఓ) శ్రీధర్ రావు, మండల వ్యవసాయ శాఖ అధికారి, పంచాయతీ రాజ్, రెవిన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమై డ్యామేజ్ అయిన గ్రామాలు తిరిగి ఇండ్లను పొలాలను పరిశీలించారు. నివేదికను కలెక్టర్ గారికి నివేదిక పంపిస్తున్నట్లు తెలిపారు. ఏది ఏమైనా అధికారులు నష్టపోయిన రైతులు పేద ప్రజలకు వెంటనే నష్టపరిహారం అందే విధంగా, ఇంట్లో డామేజ్ అయిన వారికి ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించి తగు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.
Spread the love