నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇతర ఎన్నికల కమిషనర్ల (ఈసీలు) నియామకం, సర్వీసు నిబంధనలను నియంత్రించే బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పార్లమెంటు ఉభయ సభలు గతంలో ఆమోదించిన బిల్లు ప్రకారం సీఈసీ, ఎన్నికల కమిషనర్లను (ఈసీలు) నియమించే ఎంపిక కమిటీకి ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్ మంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు అధ్యక్షత వహిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కమిటీ నుంచి తొలగించారు.