Wednesday, September 23, 2026
E-PAPER
Homeజాతీయంపీఎం మోడీతో ప్రధాని సనాయ్ తకైచి భేటీ

పీఎం మోడీతో ప్రధాని సనాయ్ తకైచి భేటీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మూడు రోజుల పర్యటనలో భాగంగా జపాన్ పీఎం భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో తాజాగా పీఎం మోడీతో ప్రధాని సనాయ్ తకైచి గురువారం ఢిల్లీ హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు ఇతర అధికారులు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు, రాష్ట్రపతి భవన్‌లో జపాన్ ప్రధాని తకైచికి లాంఛనప్రాయ స్వాగతం లభించింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన స్వాగత కార్యక్రమంలో, ప్రధాని మోడీ తన మంత్రి వర్గం సహచరులను, ఇతర ప్రముఖులను జపాన్ ప్రధానికి పరిచయం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -