Tuesday, September 1, 2026
E-PAPER
Homeజాతీయంరాజ్యసభలో ఎంపీ సుస్మితా దేవ్‌ అనుచిత వ్యాఖ్యలు

రాజ్యసభలో ఎంపీ సుస్మితా దేవ్‌ అనుచిత వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ-హైదాబాద్: రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్‌ చేసిన ‘లుంగీవాలా’ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. తనను ఉద్దేశించే ఈ పదాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ …. సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది వ్యక్తిగత వ్యాఖ్యగా చూడలేమని, దక్షిణ భారతీయుల సాంస్కృతిక గుర్తింపును కించపరిచే ప్రయత్నంగా భావించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సుస్మితా దేవ్‌పై ప్రత్యేక హక్కుల నోటీసు కూడా ఇచ్చారు.

బుధవారం ఉదయం రాజ్యసభ ప్రారంభమైన వెంటనే బ్రిట్టాస్‌ ఈ అంశాన్ని సభ దృష్టికి తీసుకెళ్లారు. తనను ఉద్దేశించి ‘లుంగీవాలా’ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు బ్రిట్టాస్‌కు మద్దతుగా నిలవగా, అధికార పక్ష సభ్యులు సుస్మితా దేవ్‌ వాదనను కూడా సభ వినాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. ‘లుంగీవాలా’ వ్యాఖ్యను కేవలం వ్యక్తిగత అంశంగా చూడకూడదని బ్రిట్టాస్‌ అన్నారు. ప్రాంతం, భాష, సాంప్రదాయ దుస్తులను ఆధారంగా చేసుకుని పార్లమెంట్‌లో ఒక సభ్యుడిని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని పేర్కొన్నారు. దక్షిణ భారత ప్రజలను ఒక రకమైన సాంస్కృతిక మూసలో చూపించేందుకు ‘లుంగీవాలా’ అనే పదాన్ని చారిత్రకంగా ఉపయోగించారని తెలిపారు. అలాంటి పదాన్ని పార్లమెంట్‌లో ఉపయోగించడం ద్వారా ప్రాంతీయ గుర్తింపును అవమానించే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -