Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీడీఓకు జీపీ కార్మికుల వినతి

ఎంపీడీఓకు జీపీ కార్మికుల వినతి

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని కొడిచెర గ్రామంలో గత 25 ఏండ్లుగా క్షమశిక్షణతో విధులు నిర్వహిస్తున్న కారోబార్ అబ్దుల్ రజాక్ ను తొలగిస్తున్నట్లు ఆ గ్రామ సర్పంచ్, పాలకవర్గ సభ్యులు బుధవారం జీపీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా కారోబార్ల మండలాధ్యక్షులు తులసీరామ్, ఉపాధ్యాక్షులు మారుతీ మాట్లాడుతూ.. అబ్దుల్ రజాక్ ఏ తప్పూ చేయలేదని అన్నారు. ఆయనపై కక్ష్యసాధింపుగా ఈ నిర్ణయం తీసుకున్నారని పాలకర్గంపై మండిపడ్డారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనీ, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. పాలకవర్గంలోని పదిమందిలో ఐదుగురు ఈ తొలగింపు చర్యను వ్యతిరేకించినా అబ్దుల్ రజాక్ ను విధుల నుంచి తొలగించడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎంపీడీఓ స్పందిస్తూ.. కారోబార్ విధుల తొలగింపుపై విచారణ జరిపి, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -