- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణాలను ఎంపిడిఓ శ్రీనివాస్, ఎంపిఓ రాము బుదువారం పరిశీలించారని జిపి కార్యదర్శి భరద్వాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఇందిరమ్మ గృహ పథకంలో మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు. పూర్తీ చేసుకున్న లబ్ధిదారులకు మూడు విడుతలుగా బ్యాంకు ఖాతా లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలను పాటించకుండా కేవలం తన ఇష్టం వచ్చినట్లు నిర్మాణాలు చేపడితే హౌసింగ్ అధికారులు నిధులు మంజూరు కావని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము , ఉప సర్పంచ్ , జి పి కార్యదర్శి భరద్వాజ్, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



