Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హెచ్ఐవి నివారణ అందరి బాధ్యత

హెచ్ఐవి నివారణ అందరి బాధ్యత

- Advertisement -

– జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకట్‌
నవతెలంగాణ – కామారెడ్డి

హెచ్ఐవి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తీవ్రతరమైన సమాచార, విద్య, అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకట్‌తో కలిసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకట్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఐవి, ఎయిడ్స్‌ నివారణలో భాగంగా విస్తృత ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలల పాటు జిల్లాలోని వివిధ కేంద్రాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

హెచ్ఐవి ప్రమాద పరిస్థితులను తెలుసుకునేందుకు రూపొందించిన క్యూఆర్ కోడ్ గోడ పత్రికలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రమాదం ఉన్నవారు క్యూఆర్ కోడ్ పోస్టర్లను సద్వినియోగం చేసుకుని అవసరమైన సేవలు పొందాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే 1097కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్‌ఎంఓ రవీందర్ గౌడ్, హెచ్ఐవి నివారణ జిల్లా అధికారి ప్రదీప్ కుమార్, ఏఆర్‌టీ వైద్యులు స్నేహ, ఆంచల్, వైఆర్‌జీ కేర్ ఉమ్మడి జిల్లా డీఆర్పీ గర్దాస్ సుధాకర్, కౌన్సిలర్లు మేక నాగరాజు, మిరుదొడ్డి శేఖర్, పాముల లలితకుమారి, మెహరాజ్, చిరంజీవి, ప్రవీణ్ గౌడ్, ఎస్‌ఎస్‌కే మేనేజర్ శ్రీనివాస్ గౌడ్‌తో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -