ప్రయివేట్ పాఠశాల యాజమాన్యాన్ని పరీక్షా కేంద్రంలోకి అనుమతి

– విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన పదవ తరగతి పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ నిర్లక్ష్యం కారణంగా పరీక్ష కేంద్రంలోకి కనీసం విద్యార్థుల తల్లిదండ్రులను కూడా అనుమతించని అధికారులు ఒక ప్రైవేట్ స్కూలు యాజమాన్యాన్ని, సెల్ ఫోన్ తో ఎలా అనుమతించారని పిల్లల యొక్క తల్లిదండ్రులు అధికారులను నిలదీశారు. ప్రైవేట్ స్కూలు యజమాని లోపలికి వెళ్లి వాళ్ళ స్కూల్ యొక్క పిల్లలని అరేంజ్మెంట్ చేస్తూ అక్కడ ఉన్న ఇన్విజిలేటర్లతో మాట్లాడుతూ బయటకు వచ్చారు. ఒక ప్రైవేట్ స్కూలు యజమాని పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తీసుకొని లోపలికి అనుమతించినప్పుడు మమ్మల్ని ఎందుకు అనుమతించరని అక్కడున్న పరీక్షా కేంద్రం నిర్వాహకులను, పోలీసులతో విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వదo దిగారు. పిల్లల యొక్క తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గుమిగూడి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని అలాగే అధికారులను నిలదీయడంతో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అక్కడి నుంచి హుటాహుటిన వెళ్లిపోయారు. పగడ్బందీగా నిర్వహించాల్సిన పదవ తరగతి పరీక్షలలో ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి పరీక్షా కేంద్రం చీఫ్ సూపర్నెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్విజి లెటర్లు వత్తాసు పలకడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
Spread the love