విద్యుత్ ఉద్యమ అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ 26వ వర్ధంతి
సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యులు
పోతినేని సుదర్శన్, నున్నా నాగేశ్వరరావు హెచ్చరిక
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
వివిధ డిస్కంల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెడితే కరెంట్ బిల్లులు విపరీతంగా పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారాలు పడతాయని, ఇటువంటి కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తే ప్రజలు మరో బషీర్ బాగ్ తరహా విద్యుత్ ఉద్యమానికి శ్రీకారం చుడతారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మంగళవారం బషీర్‌బాగ్ విద్యుత్ ఉద్యమ అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ 26వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రం వైరా రోడ్డులోని రామకృష్ణ స్తూపం వద్ద సభ నిర్వహిం చారు. ముందుగా రామకృష్ణ స్తూపం నూతన శిలాఫలకాన్ని పోతినేని సుదర్శన్ ప్రారంభించగా, పార్టీ జెండాను నున్నా నాగేశ్వరరావు ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చివరకు దేశాన్ని నడిపించే కీలక విద్యుత్ రంగాన్ని కూడా అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ దిగ్గజాలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో రైతులకు ఉచిత విద్యుత్ అందుతోందంటే, ప్రతి ఇంటికీ తక్కువ ధరకే కరెంట్ లభిస్తోందంటే, అలాగే రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల లోపు ఉచితంగా విద్యుత్ ఇస్తోం దంటే అదంతా ఈ రంగం ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్లే సాధ్యమవుతోందన్నారు. డిస్కంల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెడితే ఉచిత విద్యుత్ ఎత్తివేసి ప్రజలపై భారం వేయడం ఖాయమని, ఇప్పటికే ఉచిత విద్యుత్‌ను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోందని అన్నారు. ఆనాడు కరెంట్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రామకృష్ణ తుపాకీ గుండ్లకు బలై ప్రాణత్యాగం చేశారని, ఆయన త్యాగం ఫలితంగానే ఇప్పటివరకు కరెంట్ ఛార్జీలు పెంచా లంటే ప్రభుత్వాలు వందసార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. రాబోయే కాలంలో విద్యుత్ రంగాన్ని ప్రయివేట్ కంపెనీలకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తే మరో బషీర్ బాగ్ ఉద్యమానికి ప్రజలు సిద్ధమవుతారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, పార్టీ నాయకులు బొగ్గవీటి సరళ, బండి రమేష్, బొంతు రాంబాబు, యర్రా శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, బండి పద్మ, ఎం.ఎ. జబ్బార్, దొంగల తిరుపతి రావు, ఎస్.కె. మీరా సాహెబ్, భుక్యా శ్రీనివాసరావు, ఎస్.నవీన్ రెడ్డి, బండారు రమేష్, నందిపాటి మనోహర్, పి.రమ్య, మెరుగు రమణ, ఎస్.కె. నాగులు మీరా, బోడపట్ల సుదర్శన్, వజేనేపల్లి శ్రీనివాసరావుతో పాటు అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ సతీమణి, కూతురు, రామకృష్ణ అన్నదమ్ములు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విద్యుత్‌ను ప్రయివేటీకరిస్తే మరో బషీర్‌బాగ్ ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



