వయనాడ్ బరిలో ప్రియాంక గాంధీ: ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్

నవతెలంగాణ – ఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల్లో రెండు చోట్ల గెలుపొందిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వయనాడ్‌ సీటును వదులుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేయబోతున్నారని సమాచారం. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం ఆమెకు ఇదే తొలిసారి. రాహుల్‌ మాత్రం కాంగ్రెస్‌కు కంచుకోటలాంటి రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగనున్నారు. ఏఐసీసీలో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం వెలువడింది. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. వయనాడ్ స్థానాన్ని వదులుకోవడానికి ఎంతో మదనపడ్డానని అన్నారు. అయితే అక్కడి ప్రజలతో నా బంధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

Spread the love