రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నట్లు బీజేపీ ఒప్పుకుంది: రాహుల్ గాంధీ

నవతెలంగాణ – ఢిల్లీ: రాజ్యంగాన్ని మార్చాలని అనుకుంటున్నట్టు బీజేపీ ఎట్టకేలకు అంగీకరించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకే బీజేపీ నిరంతరం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి కన్హయ్య కుమార్‌కు మద్దతుగా దిల్షాద్ గార్డెన్‌లో గురువారం జరిగిన ఎన్నికల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ.. బీజేపీ ఎల్లప్పుడూ రాజ్యాంగాన్ని చింపివేయాలని కోరుకుంటుందని, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు దానిని కాపాడుకునేందుకు జరుగుతున్న పోరాటమని స్పష్టం చేశారు. రాజ్యాంగం అంటే కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదని గాంధీ, అంబేడ్కర్, నెహ్రూల సైద్దాంతిక వారసత్వం అని తెలిపారు.  అయితే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తే కోట్లాది మంది దేశ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Spread the love