లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాద్రి జిల్లా చర్ల మండల రెవెన్యూ కార్యలయంలో బీరవెల్లి భరణి బాబు అనే వ్యక్తి డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే కొత్తపల్లి అనుబంధ గ్రామమైన దండుపేటకు చెందిన కర్ల రాంబాబు, తన భూమి పట్టా చేయించాడు. అందుకు సంబంధించి పాసు పుస్తకం కోసం డిప్యూటీ తహసీల్దార్‌ భరణి బాబును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో పాసు పుస్తకం కావలంటే తనకు రూ.50 వేలు లంచంగా ఇవ్వాలంటూ భరణి డిమాండ్ చేశాడు. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఈరోజు రైతు రాంబాబు, భరణి బాబుకు రూ.20 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌ గా పట్టుకున్నారు.

Spread the love