బీజేపీకి అనుకూలంగా ప్రచారం..బెంగాల్‌ గవర్నర్‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌..

నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌పై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా గవర్నర్‌ ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. ఇందులో భాగంగానే కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తన ఛాతీపై బీజేపీ పార్టీ గుర్తుతో కనిపించారని ఫిర్యాదులో పేర్కొంది. ‘పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద బోస్ తన పదవిని సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రచారం చేసేందుకు ఉపయోగిస్తున్నారు. కోల్‌కతాలోని రామ్‌ టెంపుల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ తన ఛాతీపై బీజేపీ లోగోను ధరించి కనిపించారు’ అని తృణమూల్‌ పార్టీ ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

Spread the love