సీఎం రేవంత్ ను కూడా అరెస్ట్ చేస్తే: సీపీఐ నారాయణ

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తే అప్పుడు ముగ్గురు సీఎంలు జైల్లో ఉన్నట్లవుతుందని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ… ఇప్పటికే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారని, ఇప్పుడు తెలంగాణ సీఎంను కూడా పెడితే సరిపోతుందన్నారు. బీజేపీకి అనుకూలంగా ఉన్న ముఖ్యమంత్రులు దొంగలైనా వారు మంచివారేనని… కానీ ఆ పార్టీని వ్యతిరేకిస్తే మాత్రం జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డినీ జైలుకు పంపించాలని ప్రధాని మోడీ చూస్తున్నారన్నారు. కానీ దేశద్రోహం కింద మొదట అరెస్ట్ చేయాల్సి వస్తే మోడీని, రెండో వ్యక్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

Spread the love