మండలంలోని చిట్యాల గ్రామానికి కాంగ్రెస్ యూత్ నాయకులు మొగలగాని రజినీ కాంత్, తండ్రి వెంకటసోములు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. రజినీ కాంత్ స్నేహితులు బాధిత కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. తోటి స్నేహితులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్, పాక శ్రీనివాస్, ఆవుల మహేష్, నారబోయిన రమేష్, ఆవుల వెంకన్న, నిమ్మల వీరస్వామి, పాలవెల్లి వీరన్న తదితరులు పాల్గొన్నారు.