– నీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తున్న తాజా మాజీ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్
నవ తెలంగాణ – పటాన్ చెరు:
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు గ్రామానికి చెందిన దాత అంబారి భాస్కర్ మంచినీటి శుద్ధి కేంద్రాన్ని పాఠశాలకు అందించడం శుభ పరిణామం అని భానూర్ తాజా మాజీ సర్పంచ్ డాక్టర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.పటాన్ చెరు మండలం భాను గ్రామపంచాయతీ లోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు రక్షిత మంచినీటి సౌకర్యాన్ని దాత అంబరి భాస్కర్ తో కలిసి బుధవారం నాడు పాఠశాలలోని నీటి శుద్ధి కేంద్రాన్ని మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలకు కీర్తిశేషులు అంబరి రాములు జ్ఞాపకార్థం తనయుడు అంబరి భాస్కర్ విద్యార్థులకు రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దాత అంబరీ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కలుషితమైన నీరు తాగి అనారోగ్యం పాలు కావద్దని తండ్రి జ్ఞాపకార్థం తనకు తోచిన చిన్న సహాయాన్ని పాఠశాలకు అందించడం జరిగిందని. ఇక్కడ జిల్లా పరిషత్ విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధించి మండలంలోని ప్రథమ స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు. తమ విద్యార్థుల ఆరోగ్య దృష్టిలో పెట్టుకొని. తమ పాఠశాలకు రక్షిత మంచినీటి సౌకర్యాన్ని కల్పించిన అంబరి భాస్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రవికుమార్. తాజా మాజీ ఎంపిటిసి యాదగిరి మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఇతర ప్రజాప్రతినిధులు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.