Saturday, April 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 20 నుంచి 26 వరకు ప్రజాపాలన

ఈనెల 20 నుంచి 26 వరకు ప్రజాపాలన

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈనెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చర్యలు తీసుకుంటామని  యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు   తెలిపారు. శనివారం సి ఎస్ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడారు.  జిల్లాలోని 85 ఎస్.సి., ఎస్.టి., బి.సి., మైనారిటీ గురుకులాలలో, వసతి గృహాలలో వంటగది, పారిశుధ్యం, మరమ్మత్తు పనులు చేపడుతామని, విద్యార్థులకు వివిధ విభాగాలలో పోటీలు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని, రైతుల రిజిస్ట్రీ 100 శాతం పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి  జయమ్మ , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,  ఈడి యస్.సి కార్పొరేషన్అధికారి శ్యాంసుందర్ ,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి  సాహితీ, ఎంపీడీవోలు,గృహ నిర్మాణ శాఖ అధికారులు,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -