మందుబాబులకు అడ్డాగా ప్రభుత్వ పాఠశాల…!

Government school as a barrier for drug addicts...!నవతెలంగాణ – పెద్దవూర
కాపలాలేని ప్రభుత్వ పాఠశాలలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి. గ్రామాల్లో వీధివీధికో బెల్టు షాపు ఉండటంతో రాత్రి అయితే చాలు ప్రభుత్వ పాఠశాలలను కూడా మం దుబాబులు అడ్డాగా మల్చుకుంటున్నారు. పాఠశాల అవరణంలోనే సిగిరెట్లు తాగి అక్కడే వేస్తున్నారు. గురువారం చలకుర్తి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ని తూర్పు పూలగూడెం ప్రాథమికపాఠశాల లో గ్రామానికి చెందిన కొందరు మందుబాబులు తాగి బాత్ రూము ముందు మందుబాటిళ్ళు అక్కడే పగుల గొట్టి వది వెళ్తున్నారు. దీంతో ఉదయం పాఠశాలకు వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కవిత వచ్చి చూడగా బాత్రూము,మరుగుదొడ్ల ముందు మందు బాటిళ్లు, వాటర్ బాటిల్లు, పగులగొట్టిన బాటిల్లు సూసి గ్రామస్తులకు సమాచారం తెలిపారు.  గ్రామస్తులు అక్కడికి చేరుకొని సుశారు ఈసందర్బంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ సీసా బేచ్చెల వల్ల విద్యార్థులు తీవ్ర  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఇక పై ఇలాంటివి జరుగకుండా గ్రామస్తులు చూడాలని కోరారు.అలాగే పాఠశాల లో మందు తాగిన వారిని తెలుసుకొని మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో నిత్యం ఇదేతంతు జరుగుతుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయం పై పోలీసులకు పిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు.
Spread the love