
నవతెలంగాణ-ధర్మసాగర్
ప్రజా సంక్షేమమే కడియం శ్రీహరి లక్ష్యమని, నియోజకవర్గ అభివృద్ధి ఆయన ఊపిరిగా ముందుకు సాగుతున్న కడియం శ్రీహరినీ విమర్శించే హక్కు ఎవరికీ లేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుర్రపు ప్రసాద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. స్టేషన్గన్పూర్ లో ఈ ఆదివారం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాసభకు నియోజకవర్గంలో దాదాపు 50 వేల పైచిలుకు మంది ఒక స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారనీ, నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం 800 కోట్ల రూపాయలను తెచ్చిన ఘనత కడియం శ్రీహరికి దక్కుతుందన్నారు. బిఆర్ఎస్ నాయకులు సామాజిక మాధ్యమాల్లో తూతూ మంత్రంగా చాలా బలహీనంగా ముఖ్యమంత్రి మహాసభ జరిగిందని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ మహాసభ కు పాలకుర్తి,జనగామ,ఘనపూర్ ఈ మూడు నియోజకవర్గాల వారిని పిలిపించి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగేదని విమర్శించారు.తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఉపముఖ్యమంత్రి పదవి పొందిన మీకు దానిని ప్రజలకు సేవ చేయకుండా,మీ సొంత ప్రయోజనాలకు వినియోగించుకున్న నేపథ్యంలో పదవి పోగొట్టుకున్నరని గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు తర్వాత నాది నాలుగు నియోజకవర్గము ఇంగ్లీష్ పేపర్ అని ఒకటి చూపెట్టడం జరుగుతుందనీ చెప్పుకున్న మీకు బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు మీకు ఎందుకు ఇవ్వలేదనీ విమర్శించారు.కడియం శ్రీహరి ఎమ్మెల్సీ పదవిలో తాను అనుకున్న రీతిలో ప్రజలకు సేవ చేయలేదని తలంపుతో,బీఆర్ఎస్ పార్టీ తరపున ఎమ్మెల్యే పదవి పొంది నియోజకవర్గం అభివృద్ధి పథంలోనికి నడపాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గా పోటీ చేశారన్నారు. దీనికి 12 నియోజకవర్గాల్లో 10 సీట్లు కాంగ్రెస్ సాధించడం ఈ నేపథ్యంలో తన అనుకున్నది సాధించలేదని మనోవేదనతో ఉండగా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సేవలు తెలంగాణ ప్రభుత్వం కావాలని ఆహ్వానిస్తే, నియోజకవర్గాన్ని అధిక నిధులు ఇస్తానన్న మాటతో పార్టీలోనికి రావడం జరిగిందని ఆరోపించారు.దేవాదుల ప్రాజెక్టును ఆయన అన్ని గ్రామాలకు తాగు నీరు సాగు నీరు అందించేందుకు దేవాదుల ఎత్తిపోతల పథకానికి ప్రణాళిక నిర్వహణ చేపట్టారనీ తెలిపారు. కెసిఆర్ చేసిన ఏడు లక్షల కోట్ల అప్పులకు ప్రతినెల 650 కోట్లు వడ్డీలను ఇప్పటివరకు 154 కోట్లు చెల్లించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎనుమముల డైరెక్టర్ బొడ్డు ప్రదీప్ కుమార్,కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు జమాల్, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మొట్టె యామిని,కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక విన్ను,మాజీ జడ్పీటీసీ బొడ్డు వాసుదేవ్,మాజీ సర్పంచ్ కునూరు రాజు,పీ ఏ సి ఎస్ డైరెక్టర్ బొడ్డు లెనిన్,మాజీ ఎంపీటీసీ జాలిగాపు వనమాల,తోట నాగరాజు,నాయకులు రాంరెడ్డి, జాలిగపు దుర్గయ్య,యామిని,రమేష్,సదానందం, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎండి ఆఫీస్ తదితరులు పాల్గొన్నారు.