బీఆర్ఎస్ తోనే ప్రజా సంక్షేమం..

– ప్రగతి కావాలంటే, మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలి

– తొర్రూరు కేసీఆర్ సభకు భారీగా తరలి రావాలి

నవతెలంగాణ -పెద్దవంగర: రాష్ట్రంలో బీఆర్ఎస్ తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని కొనియాడారు. రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్‌ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, సీఎం కేసీఆర్‌ అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రగతి కావాలంటే, మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని ఆకాంక్షించారు. పాలకుర్తి నియోజకవర్గాన్ని కనివిని ఎరగని రీతిలో అభివృద్ధి చేశానని, అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ కు పట్టం కట్టాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఎన్నికలప్పుడే వచ్చే నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. 
 తొర్రూరు కేసీఆర్ సభకు భారీగా తరలిరావాలి
నేడు తొర్రూరు డివిజన్ కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు మండలం నుండి కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, గోపాల్ రావు, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్, పాలకుర్తి యాదగిరిరావు, ఎంపీటీసీ ఫోరం మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ బానోత్ రవీందర్ నాయక్, పాకనాటి సునీల్ రెడ్డి, బొమ్మెరబోయిన రాజు, దుంపల సమ్మయ్య, ఎండీ షర్ఫీద్దీన్, యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్, ప్రధాన కార్యదర్శి అనుదీప్, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Spread the love