న్యూయార్క్ : అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పులిట్జర్ అవార్డ్’ ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్ నిఘా, సైబర్ మోసాలను వెలుగులోకి తీసుకువచ్చిన ఈ భారతీయ జర్నలిస్టులు ఆనంద్ ఆర్.కె, సుపర్ణా శర్మలు సచిత్ర రిపోర్టింగ్ అండ్ వ్యాఖ్యానం విభాగంలో ఈ అవార్డును గెలుచుకున్నట్టు పులిట్జర్ వెబ్‌సైట్ ప్రకటించింది. ఈ అవార్డును బ్లూమ్ బెర్గ్ కు చెందిన నటాలీ ఒబికో పియర్సతో పంచుకోనున్నారు. బ్లూమ్ బెర్గ్ లో -ట్రాప్డ్’ అనే శీర్షికతో ప్రచురితమైన పరిశోధనాత్మక రిపోర్ట్ లో .. సాంకేతికతను వినియోగించి మోసగాళ్లు సామాన్యులను ఎలా ట్రాప్ చేస్తున్నారో, వారికి ఎదురయ్యే ప్రమాదాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ‘ఫోన్ ద్వారా డిజిటల్ అరెస్ట్’కు గురైన భారతదేశంలోని న్యూరాలజిస్ట్ గురించి ”చిత్రాలు, వ్యాఖ్యానం”తో , ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నిఘా, డిజిటల్ మోసాల సవాళ్లను కండ్లకు కట్టినట్టు ఈ పరిశోధనాత్మక రిపోర్ట్ వివరించినట్టు అవార్డ్ వెబ్‌సైట్ పేర్కొంది. కొలంబియా యూనివర్శిటీ పులిట్జర్ అవార్డ్‌ను ప్రకటిస్తుంది. జర్నలిజం, సాహిత్యం, సంగీత స్వరకల్పనలో ఈ అవార్డును అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు.
ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించిన ‘పులిట్జర్ అవార్డ్’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



