– 47 మంది విద్యార్థులు ఎంపిక
– అభినందనలు తెలిపిన కళాశాల చైర్మన్, ఎంపీ డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి మండలం గంగారం సాయిస్ఫూర్తి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థ ‘క్యూస్పైడర్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ను నిర్వహించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ లో కళాశాలకు చెందిన 47 మంది విద్యార్థులు సాఫ్ట్‌వేర్ డెవలపర్ ట్రైనీ ఇంజనీర్లుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం నాలుగో సంవత్సరం చదువుతున్న సీఎస్‌ఈ విభాగం నుంచి 16 మంది, సీఎస్ఎం నుంచి 15 మంది, ఏఐ అండ్ డీఎస్ విభాగం నుంచి 16 మంది చొప్పున ఎంపికయ్యారని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ దాసరి ప్రభాకరరెడ్డి తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కేవలం సాయిస్ఫూర్తి కళాశాల విద్యార్థులకు మాత్రమే ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ని నిర్వహించినట్లు ప్రభాకరరెడ్డి తెలిపారు. మొత్తం 126 మంది విద్యార్థులు హాజరవగా , రాతపరీక్ష, టెక్నికల్, హెచ్‌ఆర్, మౌఖిక ఇంటర్వ్యూల ద్వారా 47 మందిని ఎంపిక చేసినట్లు క్యూస్పైడర్ ప్రతినిధులు ప్రియదర్శిని (టెక్నికల్ లీడర్), కె. చైతన్య (సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్) వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు కోర్సు పూర్తయిన వెంటనే హైదరాబాద్‌లో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుందని వారు చెప్పారు. కళాశాల చైర్మన్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, విపాసన ఎడ్యుకేషనల్ ట్రస్టీ బండి అన్విద వర్చువల్ విధానంలో ఎంపికైన విద్యార్థులను అభినందించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వూటుకూరి శేషారత్నకుమారి మాట్లాడుతూ… నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడమే కాకుండా, విద్యార్థులు నిత్య విద్యార్థిగా కొత్త విషయాలను నేర్చుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ యాకూబ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ డీఎన్వీ కృష్ణారెడ్డి, వివిధ విభాగాల అధిపతులు, ప్లేస్‌మెంట్ ఇన్‌ఛార్జులు, అధ్యాపకులు పాల్గొని ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.



