Friday, August 14, 2026
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ కళాశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు

వ్యవసాయ కళాశాలలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
వ్యవసాయ కళాశాలలో హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ – 2026లో భాగంగా శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవ పూర్వ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సేవకులకు వందే మాతరం 150వ వార్షికోత్సవం, విభజన భయానక దినోత్సవం, సూర్యపథ్ తిరంగా ప్రాముఖ్యతను వివరించారు. దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని, స్వాతంత్ర్య విలువలను కాపాడాలని సూచించారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నీలిమ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే హానికర ప్రభావాలను వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని ఆమె సూచించారు. అనంతరం స్వచ్ఛంద సేవకులు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. గ్రంథాలయ ప్రాంగణంలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించి, అక్కడి ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో ఏడీ డాక్టర్ జె. హేమంత కుమార్, డాక్టర్ రాములు, డాక్టర్ ఎన్. జెమిమా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -