నవతెలంగాణ-నవాబు పేట
రైతులకు అండగా భారతీయ కిసాన్ సంఘ్ అండగా ఉంటుందని కిసాన్ సంఘ్ రాష్ట్ర సభ్యులు శ్రీధర్ రెడ్డి లావణ్య రెడ్డి అన్నారు.శుక్రవారం భారతీయ కిసాన్ సంఘ్ పాలమూరు జిల్లా ముఖ్య కార్యకర్తల కుటుంబ సమ్మేళనం మండల పరిధిలోని గురుకుట గ్రామంలోని సాయిబాబా దేవాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరాన్ని మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించుకోవడం జరిగిందని ప్రతి వ్యవసాయ కుటుంబంలో 70% పనులన్నీ స్త్రీలు నిర్వహిస్తుంటారని అలాంటి సందర్భంలో పంట పొలాలలో మొక్కల కోసం వాడుతున్న రసాయన ఎరువుల ద్వారా స్త్రీలు ఎక్కువగా ప్రభావితమై అనారోగ్యం బారిన పడుతుంటారని అందు కోసం రసాయన ఎరువులను తగ్గించుకొని సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేయాలని సూచించారు.
నిత్యం మనం తాగే పాలు విపరీతంగా కలుషితమైతున్నాయని అందుకని గ్రామాలలో ప్యాకెట్ పాలకు బదులుగా పాడి అభివృద్ధి చేసుకోవాలని తెలియజేశారు.పర్యావరణానికి హానికలుగుస్తున్నటువంటి ప్లాస్టిక్ తగ్గించుకోవాలని సూచించారు.నూనెల వాడకంపై రాజారెడ్డి మాట్లాడుతూ నల్ల కుసుమ పంట కనిపించడం లేదు గాని ప్రతి గ్రామంలో కొన్ని వందల కిలోల నల్ల కుసుమ నూనె ప్యాకెట్లు అమ్ముడు అవుతున్నాయని ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు .జిల్లా అధ్యక్షులు రాంరెడ్డి మాట్లాడుతూ రైతులంతా ఐకమత్యంగా ఉండాలని వివిధ వృత్తులకు సంబంధించి ప్రతి ఒక్కరికి సంఘాలు ఉన్నాయని రాజకీయాలకతీతంగా రైతులకు ఉన్నటువంటి రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పప్పు నరేందర్ రెడ్డి జిల్లా కోశాధికారి ఎదుట్ల రామ్మోహన్ రెడ్డి భీమయ్య ఆంజనేయులు నవపేట్ మండల అధ్యక్షులు జెట్టి రాములు వెంకటేశ్వరప్ప డప్పు శివ దర్శన్ శ్రీకాంత్ రెడ్డి రఘునందన్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి మహిళలు రైతులు తదితరులు పాల్గొన్నారు .



