గోదావరిఖని ఓపెన్ కాస్ట్ 5 గనిపైన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణకు రామగిరి మండల కేంద్రం నుండి బీసీ సంఘం నాయకులు తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో అక్కడి స్థానిక ఎమ్మెల్యే సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెరగా పెంచాలని మక్కాన్సింగ్ కు వినతిపత్రం ఇచ్చారు. అలాగే బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పూలే విగ్రహ ఆవిష్కరణ అనంతరం చేసిన ప్రసంగంలో పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్, బీసీ ఫౌండర్ పంజాల శ్రీనివాస్ గౌడ్, వసంత కుమార్, బీసీ సంక్షేమ సంఘం మంథని డివిజన్ అధ్యక్షులు నూనె రాజేశం ముదిరాజ్, బీసీ నాయకులు పొన్నం ప్రతాప్, తాడూరి శ్రీమాన్, తదితరులు పాల్గొన్నారు.