Saturday, June 27, 2026
E-PAPER
Homeజాతీయంరాఘ‌వ లారెన్స్ పొలిటిక‌ల్ ఎంట్రీ..11న క్లారిటీ

రాఘ‌వ లారెన్స్ పొలిటిక‌ల్ ఎంట్రీ..11న క్లారిటీ

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: స్టార్ హీరో రాఘవ లారెన్స్ రాజ‌కీయ‌ పోటీపై ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. తమిళనాడులోని కీలకమైన ‘తిరుచ్చి ఈస్ట్’ (Trichy East) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత, సీఎం విజయ్ గతంలో తాను గెలిచిన ‘తిరుచ్చి ఈస్ట్’ స్థానాన్ని వదులుకున్న నేపథ్యంలో.. ఆ సీటు నుంచి రాఘవ లారెన్స్ పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది.

ఈ ప్ర‌చారానికి ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా స్పందించారు .త‌న‌ భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11వ తేదీన ఒక కీలక ప్రకటన చేయబోతున్నాను. త‌న‌ అభిమానులు, ప్రజలు అప్పటివరకు వేచి చూడాలని కోరుతున్నాను’ అని లారెన్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -